హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు, ట్రాక్టర్ ఢీ.. తీవ్ర గాయాలు

GDWL: అలంపూర్ చౌరస్తా సమీప భైరపురం స్టేజ్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుండి వస్తున్న ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.