హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1 నాటికి అన్ని కేంద్రాలను పూర్తి సౌకర్యాలతో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రైతుల సౌలభ్యం కోసం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, తూకం యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు.