హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్‌పై వ్యాఖ్యలకు నిరసన..!

 భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తాలో టీఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌ను అరెస్టు చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెల్ల రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్న పుస్తకాన్ని, పుస్తకావిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.