హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాటర్ పైప్‌లైన్ పనులకు శ్రీకారం

BHNG: పట్టణంలోని 35వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త వాటర్ పైప్‌లైన్ పనులను మున్సిపల్ ఛైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పైప్‌లైన్ మంజూరు చేయించామని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు.