హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

MHBD: కేసముద్రం మండలం వెంకటగిరి మాజీ సర్పంచ్ మాదారపు సత్య నారాయణరావు (63) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇంటి వద్దే కన్నుమూశారు. గతంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య సరోజన, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సత్య నారాయణరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.