ADB: గత 10 రోజుల క్రితం రైలు స్టేషన్ సమీపంలో మరణించిన వ్యక్తిని పోలీసులు పట్టణంలోని రిమ్స్ శవాగారంలో భద్రపరిచారు. అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు రాకపోవడంతో పోలీసులు మానవసేవే మాధవసేవ, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు ముందుకు వచ్చి ఆయనకు బుధవారం అంత్యక్రియలు చేసి ఉదారత చాటారు.
తెలంగాణ
'అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన సొసైటీ సభ్యులు'


