హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలి: కలెక్టర్

GDWL: బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు, ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. కలెక్టరేట్‌లో రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎక్కడైనా ఇలాంటి వివాహాలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.