హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌‌లోనే IPL 2027 మినీ వేలం

ఐపీఎల్ 2027 మినీ వేలం భారత్‌లోనే జరగనుంది. గత మూడుసార్లూ విదేశాల్లోనే ఈ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం అక్టోబర్ 29న కోచి వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మెగా వేలం మాత్రం విదేశీ గడ్డపైనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.