హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోశాలకు జగిత్యాల వాసుల విరాళం

JGL: ధర్మపురి పట్టణంలోని శ్రీ కాళీమాత ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న గోశాలకు జగిత్యాలకు చెందిన సామాజిక సేవకుడు, విశ్రాంత ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ రూ.27,500 విరాళం అందజేశాడు. గోశాలకు పశుగ్రాసం అవసరమని చేసిన విజ్ఞప్తికి స్పందించి ఈ సహాయాన్ని అందించినట్లు గోశాల సహాయకుడు శ్రీకాంత్ తెలిపాడు. గోగుల సంరక్షణకు నిరంతరం పశుగ్రాసం అవసరమన్నారు.