హైదరాబాద్: 28°C
తెలంగాణ

9 రోజుల దివ్య యాత్ర.. స్పెషల్ ట్రైన్

HYD: అరుణాచలం, చిదంబరం వెళ్లాలనుకునే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ప్రకటించింది. అక్టోబర్ 6 నుంచి 9 రోజుల పాటు ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలును నడపనుంది. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర విజయవాడ మీదుగా సాగుతుంది. అరుణాచలం, మధుర, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది.