SRD: పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులోని ORR బ్రిడ్జి కింద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న సుమారు 30–35 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తిని టీజీ ఆర్టీసీ బస్సు TG 35 Z 0061 ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి


