హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేసిన సీపీ

MNCL: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచడంతో పాటు, వాటికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేసి నిర్వహించాలని సూచించారు.