హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడ్లబండిపై గణనాథుడి ఊరేగింపు

VKB: తాండూర్ పట్టణంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమితి సభ్యులు ఎడ్లబండిపై స్వామివారిని ఊరేగిస్తూ భక్తిగీతాలతో సందడి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలంతా శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.