మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో అర్హులైన వారికి 76-GO ప్రకారం ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో 29వేల పట్టాలు అందజేసినట్లు గుర్తు చేశారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో చర్చించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి: మంత్రి


