హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

MBNR: దేవరకద్ర చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.