MNCL: కన్నెపల్లి మండలం చింతపూడి అంగన్వాడీ కేంద్రం-2లో బుధవారం పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ ఒడిలా తార ఆధ్వర్యంలో వేడుక జరిగింది. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం, ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు పాటించడంపై అవగాహన కల్పించారు. సర్పంచ్ అగాడి సతీష్, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రం-2లో గర్భిణీలకు శ్రీమంతం


