హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన DRDO

ASF: ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని DRDO దత్తారాం అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు స్కూల్ యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.