హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న త్రాగునీరు

KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామం ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో త్రాగునీరు వృథాగా పోతుందని కాలనీవాసులు తెలిపారు. త్రాగునీరు వృథాగా పోతున్న గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పైప్ లైన్‌కు మరమ్మత్తులు చేపట్టి సిబ్బందిపై చర్యలు తీసుకోలన్నారు.