PDPL: ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేటలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇరుగురాల మహేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ కార్డులను అందించారు. నూతన కార్డుల ద్వారా రేషన్ బియ్యం అందించడంలో పారదర్శకత పెరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సంపత్, ఉప సర్పంచ్, GPO, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
కమ్మర్ ఖాన్ పేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


