హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

లక్ష్మీదేవిపల్లి: రేగళ్ల తండా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెత్త, అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహం, కిచెన్ స్టోర్‌లో సౌకర్యాలు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు మెనూలో చికెన్ ఉన్నప్పటికీ విద్యార్థులకు అందకపోవడంతో వార్డెన్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.