హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రిస్టియన్ కాలనీ భూమికి విముక్తి

RR: షాద్‌నగర్ క్రిస్టియన్ కాలనీలోని సర్వే నంబర్ 185ను సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిలర్ ఒగ్గు జయలక్ష్మి కిషోర్ వినతితో భూమిని పట్టా భూమిగా ఖరారు చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ల ఇబ్బందులు తొలగి, విద్యార్థుల రుణాలు, ఆస్తుల క్రయవిక్రయాలకు మార్గం సుగమమైంది. కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.