BDK: భద్రాచలం మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి బుధవారం పాల్వంచ శ్రీనివాస కాలనీకి చెందిన జరబన వెంకన్న చౌదరి రూ.1 లక్ష విరాళంగా అందించారు. స్వామివారి అన్నదాన కార్యక్రమం కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్లు తెలిపారు. ఆలయ సేవలకు విరాళం అందించిన దాతకు ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.
తెలంగాణ
'భద్రాచలం ఆలయానికి లక్ష విరాళం అందజేత'


