HYD: నగర పరిధిలోని 4 నియోజకవర్గాల ప్రజలకు హౌసింగ్ బోర్డు గుడ్‌న్యూస్ తెలిపింది. గోషామహల్, ముషీరాబాద్, LB నగర్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల ప్రజల నుంచి స్వీకరించే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. వరుస సెలవుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
‘ఆ నలుగురికి' గడువు పొడిగింపు


