హైదరాబాద్: 28°C
తెలంగాణ

వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి

NGKL: కొల్లాపూర్ మండలం సింగోటం చెరువులో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బీనామోని కృష్ణయ్య అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో వలలో చిక్కుకొని మృతి చెందారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న కృష్ణయ్య మరణంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.