హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోఠి-శంకర్‌పల్లికి డైరెక్ట్ బస్సు

HYD: కోఠి నుంచి శంకర్‌పల్లి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు డైరెక్ట్ బస్సు సర్వీసును ప్రారంభించారు. కోఠి నుంచి ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 3 సర్వీసులు, శంకర్‌పల్లి నుంచి మరో 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అబిడ్స్, సచివాలయం, లక్షీకాపూల్, మెహిదీపట్నం, లంగర్‌హౌస్, నార్సింగి, జన్వాడ, మోకిలా మీదుగా బస్సులు నడుస్తాయని మెహిదీపట్నం డీఎం అధికారులు తెలిపారు.