హైదరాబాద్: 28°C
తెలంగాణ

బురద రోడ్డుపై విద్యార్థుల అవస్థలు

MDK: నర్సాపురం నుంచి బ్రాహ్మణపల్లి పాఠశాలకు వెళ్లే 15 మంది విద్యార్థులు నిత్యం 6 కి.మీ బురదమయ రోడ్డుపై ప్రయాణిస్తూ నరకయాతన పడుతున్నారు. వర్షాకాలంలో ఈ మార్గం అధ్వానంగా మారుతుండటంతో, విద్యార్థులు పుస్తకాల బ్యాగులతో బురదలో నడుస్తూ జారిపడే ప్రమాదం ఉంది. సరైన రహదారి లేక రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.