SRPT: నడిగూడెం మండలం తెల్లబల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా పోషకాహారంపై గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరిత ఇవాళ అవగాహన కల్పించారు. కేంద్రం ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజిని, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
పోషకాహారంపై అవగాహన సదస్సు


