హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం..!

KMR: మున్సిపల్ పరిధిలోని లింగాపూర్‌కు చెందిన మ్యాదరి రవి(43) మూడు రోజులకు క్రితం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఎంత వెతికిన ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం లింగాపూర్ చెరువులో శవమై కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు జారీ పడినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.