SRPT: నడిగూడెం మండలం చెన్నకేశవపురంలో గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఇవాళ సర్పంచ్ గోసుల రాజేష్ ముందస్తు చర్యలు చేపట్టారు. అధికారుల సహకారంతో నూతన బోరు వేయించి, దాన్ని ఎస్సీ, బీసీ కాలనీల పైప్‌లైన్‌కు అనుసంధానం చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. వేసవిలో నీటి సమస్య రాకుండా చూసిన సర్పంచ్‌కు, పాలకవర్గానికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
తాగునీటి సమస్య పరిష్కారం..!


