హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఉచిత అల్పాహారం ప్రారంభం

KNR: సైదాపూర్ మండలం ఎలబోతారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సర్పంచ్ నమిండ్ల రవీందర్ బుధవారం ప్రారంభించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరీష్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.