హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ పోచమ్మ ఆలయ ఆధునికరణ కోసం నిధులు మంజూరు

PDPL: గోదావరిఖని పట్టణ చౌరస్తాలో ఉన్న పోచమ్మ ఆలయం ఆధునీకరణ కోసం కోటి రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎండోమెంట్‌తో పాటు ఎమ్మెల్యే మరికొంత నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో ఆధునీకరణ పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. కోరిన కోరికలు తీర్చే పోచమ్మ ఆలయం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతుందని పేర్కొన్నారు.