హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠపురం ఆలయం ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారం

GNTR: తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన ట్రస్టు బోర్డు సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ కమిషనర్ అనుపమ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలక వర్గం తెలిపింది.