హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిటీ సభ్యులు

VZM: ఎస్.కోట జామియా మసీదు నూతన కార్యవర్గ సభ్యులు ఎల్.కోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘అహలె సున్నత్ వల్ జమాద్’ మసీదుకు సంబంధించి జమాత్ సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు నుంచి అధికారిక అప్రూవల్ లభించేలా MLA చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరారు.