హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పెన్షన్ దరఖాస్తులలో రాజకీయ జోక్యం వద్దు'

SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెన్షన్ దరఖాస్తుల విషయంలో రాజకీయ జోక్యం జరుగుతోందని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ రవికుమార్ ఆరోపించారు. గత 3 రోజులుగా పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సచివాలయాల్లో కొంతమంది రాజకీయ నాయకులు కూర్చొని, కొందరికి దరఖాస్తులు చేయాలని, మరికొందరికి చేయవద్దని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.