హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మేయర్ పదవి దళితులకే కేటాయించాలి'

విశాఖ మేయర్ పదవిని జనాభా ప్రాతిపదికన దళితులకు కేటాయించాలని జనసేన నేత, దళిత సంఘం నాయకుడు పెద్దాడ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబాగార్డెన్స్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. వైసీపీ హయాంలో డిప్యూటీ మేయర్ పదవి కల్పించినట్లే, ఈసారి మేయర్ పదవికి దళితులకు అవకాశం ఇవ్వాలని కోరారు.