హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ తీగల పక్కనే ప్రమాదకరంగా ఎండిన చెట్టు

PDPL: ధర్మారం మండలం కొత్తూరులో పోచమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ తీగల పక్కనే ఎండిన చెట్టు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెట్టు నేలకులే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు విద్యుత్ తీగలపై పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎండిన చెట్టును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.