హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

VKB: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఉద్యోగ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.