VKB: వినాయక చవితిని పురస్కరించుకుని తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ మణిసాయి పెన్సిల్ లెడ్‌పై కేవలం 3 మి.మీ. పొడవుతో గణేశుడి ప్రతిమను చెక్కి అబ్బురపరిచారు. గతేడాది 7 మి.మీ. పరిమాణంలో ప్రతిమను రూపొందించిన ఆయన, ఈసారి మరింత సూక్ష్మంగా తీర్చిదిద్దారు. పర్వదినాలు, జయంతులను పురస్కరించుకుని పెన్సిల్ లెడ్‌పై సూక్ష్మ కళాఖండాలు చెక్కడం తన హాబీ అని తెలిపారు.
తెలంగాణ
పెన్సిల్ లెడ్‌పై సూక్ష్మ గణేశుడు


