MHBD: ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, లేకుంటే ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. బుధవారం ములకలపల్లిలో ఆమె మాట్లాడుతూ.. 2024 వరదల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జికి ఏడాది గడిచినా శాశ్వత నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. సత్వరమే పనులు ప్రారంభించి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలి: మాజీ మంత్రి


