హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరంగాపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు

WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే నూతన ఎంపీడీవోను బీజేపీ నాయకులు సన్మానించారు. మండల అధ్యక్షుడు నలవోతుల విష్ణువర్ధన్ నాయుడు పాల్గొన్నారు.