హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

NRPT: ఊట్కూర్ మండలం చిన్నపోర్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్ బుధవారం పంపిణీ చేశారు. రూ.1.46 లక్షల విలువైన ఈ చెక్కులు పేద కుటుంబాల వైద్యానికి ఎంతో ఆసరాగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.