హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతుల బెడద.. డ్రోన్‌తో తరుముతున్న రైతులు

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో కోతుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులంతా కలిసి డ్రోన్‌ సాయంతో కోతులను తరిమే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి కోతుల బెడదను నివారించాలని రైతులు కోరుతున్నారు.