హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలు

భద్రాచలం: ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు సంస్థ తెలిపింది. హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, బ్యూటీషియన్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, గ్రాఫిక్ డిజైన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని, నిరుద్యోగ యువత ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.