హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైరాన్ పల్లి అమరవీరులకు సీపీఐ నివాళులు

సిద్దిపేట: తెలంగాణ సాయుధ పోరాటం 78వ వారోత్సవాల సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం బైరాన్‌పల్లిలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. స్థూపం, చారిత్రక బురుజు వద్ద పూలమాలలు వేసి స్మరించుకున్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లి ప్రజలు చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.