హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో ఉపాధి పనుల తనిఖీ

KDP: వేంపల్లె పంచాయతీ సమీపంలో చేపడుతున్న కందకాల తవ్వకం ఉపాధి హామీ పనులను బుధవారం ఏపీడీ వెంకటసుబ్బయ్య పరిశీలించారు. అనంతరం మస్టర్‌ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూలీలకు కనీస వేతనం రూ.307 వచ్చే విధంగా మార్కింగ్ ఇచ్చి పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి హామీ పనుల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడంతో భూగర్భ జలాలు పెరగొచ్చన్నారు.