హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీ నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

JGL: బుగ్గారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచిస్తూ, నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.