హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతికి రూ.11 లక్షల వెండి తోరణం బహుకరణ

BDK: అశ్వారావుపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రముఖ వ్యాపారవేత్త, విజయ సాయి సెల్ వరల్డ్ అధినేత సీమకుర్తి జితేంద్ర-అమృత దంపతులు రూ.11 లక్షల విలువైన వెండి మకర తోరణాన్ని బుధవారం సమర్పించారు. సుమారు 4 కిలోల స్వచ్ఛమైన వెండితో రూపొందించిన తోరణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు దంపతులను ఘనంగా సన్మానించారు.