హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

ములుగు జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. RBSK బృందాల సహకారంతో నిపుణులు పాఠశాలలకు వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. దృష్టిలోపం, ఇతర కంటి సమస్యలను గుర్తించి మందులు అందిస్తున్నారు. కంటి అద్దాలు అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు అందించనున్నారు.