హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.90 వేలు పలికిన వినాయకుడి లడ్డు

KDP: మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లిలో వినాయకుడి లడ్డుకు బుధవారం నిర్వహించిన వేలంలో కొండిశెట్టి బాలసిద్ధయ్య రూ.90 వేలకు దక్కించుకున్నారు. కలశం చెంబు రూ.43 వేలు, చెరకు గడలు రూ.7 వేలు, వెండి బిళ్ల రూ.22,500లకు వేలం పలికాయి. అనంతరం అన్నదానం నిర్వహించి, గణనాథుడి విగ్రహాన్ని బ్రహ్మసాగర్ రిజర్వాయర్‌లో నిమజ్జనం చేశారు.