హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండాలో విద్యార్థులకు దుస్తులు, షూల పంపిణీ

NZB: మెండోరా మండలం వెల్గటూర్ తండా ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు దుస్తులు, షూలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వెల్గటూర్ నడిమి తండా సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలన్నారు.